అనారోగ్యంతో బాధపడుతున్న నిరుపేదకు ఎమ్మెల్యే ఏలేటి భరోసా

కలం, దిలావర్‌పూర్ : దిలావర్‌పూర్ మండలం గుండంపల్లి గ్రామానికి చెందిన సుంచు సరస్వతి అనారోగ్యంతో హైదరాబాద్‌ లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF Cheque) నుంచి మంజూరైన రూ. 2 లక్షల ఎల్‌ఓసీ చెక్కును బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి బుధవారం బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆపదలో ఉన్న నిరుపేద కుటుంబాలకు సీఎంఆర్‌ఎఫ్‌ ఎంతో ఆసరాగా నిలుస్తుందని పేర్కొన్నారు. వైద్య చికిత్సకు ఆర్థిక సాయం అందేలా సహకరించిన ఎమ్మెల్యేకు బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>