సీఎస్ సాయి ప్రసాద్ పదవీ కాలం పొడిగింపు

కలం, వెబ్ డెస్క్: ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్ (CS Sai Prasad) పదవీ కాలాన్ని మరో ఆరు నెలలు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నవంబర్‌లో ఆయన రిటైర్డ్ కాబోతున్న నేపథ్యంలో మరో ఆరు నెలలు సీఎస్‌గా కొనసాగేలా అనుమతించాలని ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం డీవోపీటీకి లేఖ రాసింది. ఈ మేరకు డిసెంబర్ ఒకటో తేదీ నుంచి 2027 మే 31 వరకు సీఎస్‌గా కొనసాగేందుకు అంగీకరిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. 1991 బ్యాచ్ ఐఏఎస్ అధికారైన సాయి ప్రసాద్ ఉమ్మడి ఏపీలో, నవ్యాంధ్రలో అనేక కీలక స్థానాల్లో పనిచేస్తూ వచ్చారు.

Also Read : ప‌వ‌న్ రాజీనామా వార్త‌ల‌పై డిప్యూటీ సీఎంవో రియాక్ష‌న్‌!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>