నేడు మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించనున్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు

కలం, వెబ్ డెస్క్ : జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా పరిధిలోని మేడిగడ్డ బ్యారేజీని (Medigadda Barrage) బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల బృందం నేడు(శనివారం) సందర్శించనుంది. హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు ఈ పర్యటనలో పాల్గొననున్నారు. బ్యారేజీ పరిస్థితిని క్షేత్రస్థాయిలో పరిశీలించి వివరాలు తెలుసుకోవడమే లక్ష్యంగా నేతలు పర్యటనకు సిద్ధమయ్యారు. ఈ పర్యటనలో భాగంగా ఎమ్మెల్యేలు (BRS MLAs) తొలుత హైదరాబాద్‌ నుంచి బయలుదేరి ఘట్‌కేసర్‌ వద్ద సమావేశం కానున్నారు. అక్కడి నుంచి అందరూ కలిసి మేడిగడ్డకు ప్రయాణించనున్నారు.

మార్గమధ్యంలో వరంగల్‌లోని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు (Errabelli Dayakar Rao) నివాసంలో అల్పాహారం తీసుకోనున్నారు. అనంతరం ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు కూడా ఈ బృందంతో కలిసి మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage)కి వెళ్లనున్నారు. నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం ఉదయం 10:30 గంటలకు నేతలు బ్యారేజీ వద్దకు చేరుకుని పరిశీలన చేపట్టనున్నారు. బ్యారేజీ ప్రస్తుత స్థితిగతులు, అక్కడి పరిస్థితులను ప్రత్యక్షంగా తెలుసుకోనున్నారు. ఈ పర్యటనలో భాగంగా నేతలు ఏయే అంశాలను పరిశీలిస్తారు, అనంతరం ఎలాంటి వివరాలు వెల్లడిస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది. మేడిగడ్డ బ్యారేజీ పర్యటనకు సంబంధించి ఎమ్మెల్యేల బృందం ఏర్పాట్లు పూర్తి చేసుకున్నట్లు సమాచారం.

Also Read : 2028 నాటికి ‘మేడ్ ఇన్ ఇండియా’ మొబైల్!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>