‘బ్రాహ్మణ శంఖారావం’ను జయప్రదం చేయాలి : భీం సేన్ రావు

కలం, నారాయణపేట: ఈనెల 25వ తేదీన బ్రాహ్మణ ఆర్గనైజేషన్ ఫర్ సోషల్ సర్వీస్, బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో జడ్చర్ల లోని వాసవి కళ్యాణ మండపంలో బ్రాహ్మణ శంఖారావం (Brahmin Shankharavam) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సంఘం నాయకులు కొల్లూరు భీం సేన్ రావు తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను సోమవారం స్థానిక సుభాష్ రోడ్ లోని శక్తిపీఠం వద్ద మీడియాకు వివరాలను వెల్లడించారు.

ఉమ్మడి పాలమూరు జిల్లా బ్రాహ్మణ శంఖారావం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి డి. శ్రీధర్ బాబు, బ్రాహ్మణ ఆర్గనైజేషన్ ఫర్ సోషల్ సర్వీస్ సంస్థ రాష్ట్ర అధ్యక్షులు, బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్ బసవరాజు శ్రీనివాసు కార్యక్రమానికి హాజరవుతున్నట్లు తెలిపారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని బ్రాహ్మణుల సంక్షేమం, తదితర అంశాలపై ఈ సమావేశంలో ముఖ్య అతిథులు మాట్లాడతారన్నారు.

కావున ఉమ్మడి పాలమూరు జిల్లాలోని బ్రాహ్మణులు, నారాయణపేట జిల్లాలోని బ్రాహ్మణ మహిళా సంఘం, భజనా మండలి సభ్యులు హాజరై తమ ఐక్యతను చాటాలని భీం సేన్ రావు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నారాయణపేట జిల్లా బ్రాహ్మణ సంఘం పెద్దలు సంగ్వార్ గోపీనాథ్ రావ్ , కంసాన్ పల్లి రఘునాథ్ రావ్ , ఆయుర్వేద వైద్యులు ఉట్కూర్ విశ్వావసు పురోహిత్, తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>