బోనకల్ పంచాయతీ కార్మికులకు యూనిఫామ్‌ల పంపిణీ

కలం, బోనకల్ : ఖమ్మం జిల్లా బోనకల్ (Bonakal) గ్రామపంచాయతీ కార్యాలయంలో బుధవారం గ్రామ సర్పంచ్ బానోతు జ్యోతి కొండ, పంచాయతీ కార్యదర్శి కోల రాజేశ్వరి ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ కార్మికులకు యూనిఫామ్‌లను పంపిణీ(Uniform Distribution) చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ బానోతు జ్యోతి కొండ మాట్లాడుతూ, గ్రామ పరిశుభ్రతను కాపాడటంలో, ప్రజలకు మెరుగైన పారిశుద్ధ్య సేవలు అందించడంలో గ్రామపంచాయతీ కార్మికుల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు.

గ్రామాన్ని పరిశుభ్రంగా, ఆరోగ్యకరంగా ఉంచేందుకు కార్మికులు నిత్యం చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు. కార్మికులకు గుర్తింపు, గౌరవం కల్పించడంతో పాటు, వారికి అవసరమైన సదుపాయాలు అందించేందుకు గ్రామపంచాయతీ తరఫున కృషి చేస్తామని తెలిపారు. గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణను మరింత మెరుగుపరిచి, ప్రజల సహకారంతో బోనకల్‌ను పరిశుభ్రమైన గ్రామంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ సిబ్బంది, కార్మికులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>