జన గణనపై ఛార్జ్ క్లర్కులు, టెక్నికల్ అసిస్టెంట్లకు శిక్షణ

కలం, మహబూబ్‌న‌గ‌ర్ బ్యూరో: జిల్లాలో చేపట్టనున్న జనాభా గణన రెండో దశను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు, సిబ్బంది నిర్దేశిత విధివిధానాలను పాటించాలని డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ భారతి హోలీకేరి (Bharathi Holikeri) సూచించారు. శుక్రవారం మహబూబ్‌నగర్ కలెక్టరేట్‌లోని ఎన్ఐసీ వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లా కలెక్టర్, ప్రిన్సిపల్ సెన్సస్ అధికారి ఖుష్బూ గుప్తా సమక్షంలో ప్రారంభించి మొదటి రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ నుండి డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ భారతి హోలీకేరి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

అక్టోబర్ 16, 17 న నిర్వహించే రెండు రోజుల జిల్లా స్థాయిల శిక్షణలో భాగంగా జనాభా గణన రెండో దశలో చేపట్టాల్సిన పనులు, అధికారుల బాధ్యతలపై అవగాహన కల్పించారు. అలాగే ఛార్జ్ క్లర్కులు, టెక్నికల్ అసిస్టెంట్లకు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా భారతి హోలీకేరి మాట్లాడుతూ.. జనాభా గణన రెండో దశలో అనుసరించాల్సిన విధివిధానాలు, నిర్వహించాల్సిన పనులు, అధికారుల విధులు, బాధ్యతలను అధికారులకు వివరించారు. జనాభా గణన ప్రక్రియలో ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా, నిబంధనలకు అనుగుణంగా విధులు నిర్వహించాలని సూచించారు. అనంతరం హైదరాబాద్ నుంచి వచ్చిన శిక్షకులు దయానందం, శివరామకృష్ణ ఛార్జ్ క్లర్కులు, టెక్నికల్ అసిస్టెంట్లకు జనాభా గణన రెండో దశలో చేపట్టాల్సిన పనులు, అనుసరించాల్సిన పద్ధతులపై శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ప్రిన్సిపల్ సెన్సస్ అధికారి రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.ఎల్.బి. హరిప్రియ, అసిస్టెంట్ కలెక్టర్ అండర్ ట్రైనీ, సాయి శివాని, జిల్లా సెన్సస్ అధికారి నర్సింలు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>