కలం, భైంసా: భైంసా (Bhainsa) పట్టణంలో దుర్గామాత నిమజ్జనోత్సవాలను పురస్కరించుకొని భక్తుల కోసం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాలను ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ (Pawar Ramarao Patel) బుధవారం ప్రారంభించారు. పట్టణంలో ప్రతి సంవత్సరం నిర్వహించే భవాని నిమజ్జనోత్సవాల్లో భాగంగా ప్రముఖ వ్యాపారవేత్త తిరుమల హార్డ్వేర్ వెంకటేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంతో పాటు, మున్సిపల్ చైర్మన్ తుమ్మోళ్ల దత్తాత్రి, ఓమ్ గ్రూప్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దుర్గామాత నిమజ్జనోత్సవాలకు వచ్చే భక్తులకు అన్నదానం ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. అనంతరం దుర్గామాత నిమజ్జన శోభాయాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ నృత్యాలు చేస్తూ సందడి చేశారు. భక్తులతో కలిసి ఉత్సాహంగా శోభాయాత్రలో పాల్గొన్నారు.

