కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జగన్నాధపురం పీహెచ్సీ, వెంగళరావు నగర్ సబ్సెంటర్లను జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి (Bhadradri Kothagudem DMHO) డాక్టర్ తుకారామ్ రాథోడ్ గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించి, సిబ్బందికి పలు సూచనలు జేశారు. ఆరోగ్య కేంద్రాల్లో పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా సిబ్బంది శ్రమదానం నిర్వహించాలన్నారు. ఆ ఫొటోలను అధికారులకు పంపాలని డీఎంహెచ్వో ఆదేశించారు. అలాగే కార్యాలయాల్లో నిరుపయోగంగా ఉన్న వ్యర్థ పదార్థాలను నిబంధనల ప్రకారం తొలగించాలన్నారు.
వెంగళరావు నగర్ నూతన సబ్సెంటర్ భవనానికి రాకపోకల మార్గం (అప్రోచ్ రోడ్డు) మెరుగుపరిచేలా చర్యలు తీసుకోవాలన్నారు. గర్భిణులు, వృద్ధులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని స్థానిక ప్రజాప్రతినిధుల సమన్వయంతో కృషి చేయాలని సూచించారు. డీఎంహెచ్వో వెంట డాక్టర్ మెహర్ ఉన్నిషా, ఆరోగ్య సిబ్బంది ఉన్నారు.

