భద్రాచలంలో కార్డన్ సెర్చ్.. 58 వాహనాలు సీజ్

కలం, ఖమ్మం బ్యూరో :  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం రాజుపేట కాలనీలో(Rajupeta Colony), ఆదివారం డీఎస్పీ అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. సరైన పత్రాలు, నంబర్ ప్లేట్లు లేని 58 వాహనాలను స్వాధీనం చేసుకుని, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినందుకు 150 కేసుల్లో రూ.36,390 జరిమానా విధించారు.

అనంతరం నిర్వహించిన కమ్యూనిటీ కనెక్ట్ కార్యక్రమంలో డీఎస్పీ మాట్లాడుతూ.. గంజాయి, మత్తు పదార్థాల విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాలనీవాసులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. మద్యం తాగి వాహనాలు నడపరాదని, సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. సైబర్ మోసాలకు గురైతే 1930 హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలని సూచించారు. అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులకు సమాచారం అందించి, శాంతిభద్రతల పరిరక్షణలో సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ తనిఖీల్లో సీఐలు రాజు, వెంకటప్పయ్య, పోలీస్, స్పెషల్ పార్టీ సిబ్బంది, డాగ్ స్క్వాడ్ బృందం పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>