Mobile Popup Ad
Mobile Popup Ad

నానబెట్టిన కిస్‌మిస్‌తో డబుల్ బెనిఫిట్స్.. నలుపు vs పసుపు ఏది బెస్ట్?

కలం, వెబ్ డెస్క్: కిస్‌మిస్ (Raisins) అనేది ద్రాక్షపండ్లను ఎండబెట్టడం ద్వారా తయారుచేసే అత్యంత పోషకమైన డ్రై ఫ్రూట్. ఎలాంటి కృత్రిమ చక్కెరలు లేకుండా, నోటికి మంచి తీపి రుచిని అందించే కిస్‌మిస్ ను పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడతారు. ఇందులో ఐరన్, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కిస్‌మిస్‌లో ఐరన్ అధికంగా ఉంటుంది, ఇది శరీరంలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని పెంచి ఎనీమియా (రక్తహీనత) రాకుండా కాపాడుతుంది. ఇది సహజ విరేచనకారిగా (Laxative) పనిచేసి మలబద్ధకం సమస్యను దూరం చేస్తుంది. ఇందులో ఉండే పొటాషియం శరీరంలోని ఉప్పు (సోడియం) శాతాన్ని సమతుల్యం చేసి, రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది.

సాధారణంగా కిస్మిస్ లను మనం స్వీట్లు, పాయసం వంటి వంటకాల్లో వేసుకుని తినడానికి ఇష్ట​పడతారు. కొంత మంది పచ్చిగానే తినేస్తారు. అయితే, కిస్‌మిస్‌లను పచ్చిగా తినడం కంటే, రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే పరగడుపున తినడం వల్ల రెట్టింపు ప్రయోజనాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నానబెట్టడం వల్ల వాటిలోని పోషకాలను శరీరం త్వరగా గ్రహిస్తుంది. కానీ, మార్కెట్లో లభించే నల్ల కిస్‌మిస్, పసుపు కిస్‌మిస్‌లలో ఏది ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

నల్ల కిస్‌మిస్ (Black Raisins)

ఇవి నలుపు లేదా ఎరుపు ద్రాక్షలను నేరుగా ఎండలో ఎండబెట్టడం ద్వారా తయారవుతాయి. ఎలాంటి రసాయనాలు వాడకపోవడం వల్ల వీటిలో యాంటీఆక్సిడెంట్లు (ఆంథోసైనిన్స్), ఐరన్, ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటాయి. రక్తహీనత ఉన్నవారికి, జుట్టు రాలడం తగ్గడానికి మరియు రోగనిరోధక శక్తి పెరగడానికి నల్ల కిస్‌మిస్ అత్యంత శక్తివంతమైనదిగా పనిచేస్తుందని సూచిస్తున్నారు నిపుణులు.

పసుపు కిస్‌మిస్ (Yellow/Golden Raisins)

వీటిని రంగు మారకుండా ఉండటానికి సల్ఫర్ డయాక్సైడ్‌తో ట్రీట్ చేస్తారు. ఇవి సాధారణ కిస్‌మిస్‌ల కంటే ఎక్కువ మెత్తగా, జ్యుసీగా ఉంటాయి. జీర్ణక్రియను మెరుగుపరచడానికి, బ్లడ్ షుగర్ లెవల్స్ బ్యాలెన్స్ చేయడానికి, థైరాయిడ్ స్థాయిలను అదుపులో ఉంచడానికి ఇవి సహాయపడతాయని చెబుతున్నారు నిపుణులు.

పోషకాల సాంద్రత, ఐరన్, యాంటీఆక్సిడెంట్ల పరంగా చూస్తే పసుపు కిస్‌మిస్ కంటే నల్ల కిస్‌మిస్ ఎక్కువ శక్తివంతమైనదిగా నిపుణులు భావిస్తారు. అయితే, రెండు రకాల కిస్‌మిస్‌లు కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కాబట్టి, మీ అవసరాన్ని బట్టి రెండింటినీ మితంగా డైట్‌లో చేర్చుకోవడం మంచిది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>