కలం, బాసర: బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయం (Basara Saraswati Temple) లో శారదీయ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. నవరాత్రుల్లో ఐదవ రోజైన గురువారం అమ్మవారు స్కందమాత అలంకారం (Skandamata Alankaram) లో భక్తులకు దర్శనమిచ్చారు. స్కందభగవానుడైన కుమారస్వామికి తల్లి కావడంతో అమ్మవారిని స్కందమాతగా పూజిస్తారు.
సింహవాహనంపై ఆసీనురాలైన అమ్మవారు చేతుల్లో కమలం, జలకలశం, ఘంటను ధరించి, మరో చేతితో అభయముద్రలో భక్తులకు దర్శనమిచ్చారు. ఒడిలో కుమారస్వామి కొలువుదీరిన రూపం భక్తులను ఆకట్టుకుంది. ఈ సందర్భంగా అమ్మవారికి విశేష అర్చనలు నిర్వహించి, పెరుగన్నాన్ని నైవేద్యంగా సమర్పించారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శుక్రవారం నిర్వహించనున్న మూల నక్షత్రం సందర్బంగా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
Also Read : రాహుల్ గాంధీపై సీజేఐ సూర్యకాంత్ ఆగ్రహం
Follow Us On: X(Twitter)

