అంతర్జాతీయ క్రికెట్‌లో బాబర్ అరుదైన ఘనత!

క‌లం, స్పోర్ట్స్‌: పాకిస్థాన్ దిగ్గజ బ్యాటర్ బాబర్ ఆజమ్ (Babar Azam) అంతర్జాతీయ క్రికెట్‌లో 16,000 పరుగుల అరుదైన మైలురాయిని చేరుకుని సరికొత్త రికార్డు సృష్టించారు. రావుల్పిండి క్రికెట్ స్టేడియంలో శ్రీలంకతో జరిగిన వన్డే త్రైపాక్షిక సిరీస్ తొలి మ్యాచ్‌లో ఆయన ఈ ఘనత సాధించారు. మూడు ఫార్మాట్లలో కలిపి ఈ మైలురాయిని అందుకున్న ఐదో పాకిస్థాన్ క్రికెటర్‌గా ఆయన నిలిచారు.

అంతకుముందు ఇన్జమామ్ ఉల్ హక్, జావేద్ మియాందాద్, మహమ్మద్ యూసుఫ్, యూనిస్ ఖాన్ మాత్రమే ఈ జాబితాలో ఉన్నారు. అంతేకాకుండా అత్యంత వేగంగా ఈ మైలురాయిని చేరుకున్న మూడో పాక్ బ్యాటర్‌గా బాబర్ రికార్డుల్లోకెక్కారు. ఆయన కేవలం 399 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ 16 వేల పరుగులను పూర్తి చేసుకున్నారు. మహమ్మద్ యూసుఫ్ (388 ఇన్నింగ్స్‌లు), జావేద్ మియాందాద్ (398 ఇన్నింగ్స్‌లు) మాత్రమే బాబర్ కంటే వేగంగా ఈ రికార్డు సాధించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>