కలం, స్పోర్ట్స్: ఆసియా పారా గేమ్స్ (Asian Para Games) లో భారత బ్యాడ్మింటన్ (Badminton) ప్రయాణం ముగిసింది. చివరి రోజు మూడు స్వర్ణ పతకాలతో భారత్ సత్తా చాటింది. దీంతో ఈ పోటీల్లో మొత్తం 16 పతకాలతో తన ప్రస్థానాన్ని ముగించింది. ఇందులో మూడు స్వర్ణాలు, ఐదు రజతాలు, ఎనిమిది కాంస్య పతకాలు ఉన్నాయి. పురుషుల సింగిల్స్ ఎస్ఎల్3 ఫైనల్లో నితేశ్ కుమార్ తన సహచర ఆటగాడు ప్రమోద్ భగత్‌ను ఓడించాడు. 21-18, 21-16 తేడాతో గెలిచి స్వర్ణం సాధించాడు. గతంలో 2018, 2022 ఆసియా పారా గేమ్స్‌లో స్వర్ణాలు గెలిచిన ప్రమోద్.. ఈసారి రజతంతో సరిపెట్టుకున్నాడు.
పురుషుల సింగిల్స్ ఎస్ఎల్4 ఫైనల్లో నవీన్ శివకుమార్ ఇండోనేషియాకు చెందిన ఫ్రెడ్డి సెటియావాన్‌ను ఓడించాడు. 21-9, 21-17 తేడాతో విజయం సాధించి స్వర్ణ పతకాన్ని అందుకున్నాడు. ఆసియా పారా గేమ్స్‌లో అరంగేట్రం చేసిన నవీన్.. తొలి ప్రయత్నంలోనే టైటిల్ గెలిచాడు. మహిళల డబుల్స్ ఎస్ఎల్3-ఎస్‌యూ5 విభాగంలో థులసిమతి మురుగేశన్, మానసి జోషి జోడీ స్వర్ణం సాధించింది. చైనాకు చెందిన యాంగ్ క్యూషియా, జియావో జుజియాన్ జోడీపై 21-16, 21-13 తేడాతో గెలిచింది.
తులసిమతి మహిళల సింగిల్స్‌లో రజతం సాధించగా, నితేశ్తో కలిసి మిక్స్డ్ డబుల్స్‌లోనూ రజతం గెలిచింది. దీంతో ఒకే రోజు ఒక స్వర్ణం, రెండు రజతాలతో మూడు పతకాలు తన ఖాతాలో వేసుకుంది. మహిళల సింగిల్స్ ఎస్‌హెచ్6 ఫైనల్లో నిత్య శ్రీ సుమతి శివన్ (Nithya Sre Sumathy Sivan) చైనాకు చెందిన లీ ఫెంగ్మేయ్ చేతిలో ఓడిపోయింది. 12-21, 13-21 తేడాతో పరాజయం పాలై రజత పతకం సాధించింది. ఇలా మూడు స్వర్ణాలు, ఐదు రజతాలు, ఎనిమిది కాంస్యాలతో భారత బ్యాడ్మింటన్ జట్టు ఆసియా పారా గేమ్స్ (Asian Para Games) ప్రస్థానాన్ని ముగించింది.
Also Read : క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన సబ్బినేని మేఘన
Follow Us On: Youtube

