కలం, కరీంనగర్: స్త్రీ నిధి యాప్ ద్వారా అత్యధిక లోన్ రీపేమెంట్, ఈఎంఐ చెల్లింపుల్లో కరీంనగర్ జిల్లా రాష్ట్రంలో ప్రతిభ చాటడంపై అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ (Ashwini Tanaji) హర్షం వ్యక్తం చేశారు. వ్యక్తిగత విభాగంలో రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానం సాధించిన ఏఎం బాబురాజు, జిల్లాను రెండో స్థానం నిలపడంలో కృషి చేసిన రీజినల్ మేనేజర్ ఎస్కే మదార్‌కు ప్రశంసాపత్రాలు అందించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీవో గీత, అదనపు డీఆర్డీవో రవి కుమార్, డీపీఎం సుధారాణి, సతీష్, వేణుగోపాల్ పాల్గొన్నారు.

