కలం, వెబ్ డెస్క్: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఏపీ ఎన్నికల సంఘం (AP Election Commission) నేడు కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 100 మున్సిపాలిటీ ఎన్నికల్లో ఎన్నికల ప్రక్రియను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు బుధవారం రాత్రి ఎన్నికల సంఘం ప్రకటన చేసిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో తాత్కాలికంగా నిలిపేయాలా.. పూర్తిగా వాయిదా వేయాలా.. అనేది తేల్చబోతున్నారు. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్సీలు, కమిషనర్లను ఎన్నికల సంఘం ప్రధాన అధికారి అనిల్ చంద్ర పునేఠా నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఈ రోజు సాయంత్రం వరకు ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.
మిగతా ఎన్నికలపై ప్రభావం..
స్థానిక సంస్థలను ఒకవేళ వాయిదా వేస్తే ఎంపీటీ, జడ్పీటీసీ ఎన్నికలపైనా ప్రభావం పడుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో ఎన్నికల సంఘం ఏం నిర్ణయం తీసుకుంటుందనేది ఉత్కంఠగా మారింది. ఇదిలా ఉంటే, తమను నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారని వైసీపీ నేతలు సుప్రీం కోర్టును ఆశ్రయించగా.. ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు మున్సిపాలిటీ ఎన్నికలను తాత్కాలికంగా నిలిపేస్తూ ప్రకటన విడుదల చేయడంపై వైసీపీ హర్షం వ్యక్తం చేస్తోంది. ఇకనైనా ఎన్నికలు నిజాయితీగా జరిగేలా చొరవ తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరారు.

