కలం, వెబ్ డెస్క్: చొక్కా నలగకుండా రూ.500 కోట్లు కొట్టడం ఒక్క రజినీకాంత్ కే సాధ్యమని స్టార్ హీరో అల్లు అర్జున్ (Allu Arjun) ప్రశంసించారు. ‘జైలర్–2’ మూవీ అద్భుతంగా ఉందంటూ పోస్ట్ చేశారు. ‘సూపర్ స్టార్ రజినీకాంత్ స్టార్ పవర్, స్వాగ్, ఆరాను అద్భుతంగా ఆవిష్కరించిన మూవీ ఇది. సినిమా చూస్తున్నంత సేపు ఎక్కడా ఉత్సాహం తగ్గకుండా.. ఉత్కంఠను కలిగించే పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ ఇది. అనిరుధ్ అద్భుతమైన సంగీతం అందించారు. ఈ మూవీ కోసం నటులు, సాంకేతిక నిపుణులు, నిర్మాతలు మనసు పెట్టి, ఎంతో శ్రద్ధతో పనిచేశారని అర్థమవుతోంది. డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ భారీ విజయాన్ని సాధించారు. చిత్ర బృందానికి నా అభినందనలు’ అని అల్లు అర్జున్ పోస్ట్ చేశారు. అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో రాకా మూవీలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సన్ పిక్చర్స్ సంస్థనే జైలర్–2కి కూడా నిర్మించింది.

