HPV టీకా అవగాహనలో ఆదర్శంగా నిలిచిన ‘బన్నీ’ ఫ్యాన్స్!

కలం, ఖమ్మం బ్యూరో : సినిమాలు చూడటం, థియేటర్ల వద్ద కటౌట్లకు పాలాభిషేకాలు చేయడానికే పరిమితం కాకుండా, ప్రజారోగ్యమే ధ్యేయంగా ముందుకు సాగుతూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులు ఆదర్శంగా నిలుస్తున్నారు. యువత ఆరోగ్య పరిరక్షణతో పాటు క్యాన్సర్ల నివారణకు ఉపయోగపడే హెచ్‌పీవీ టీకా (HPV vaccine) ప్రాధాన్యతపై ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు తెలంగాణ రాష్ట్ర అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ చేపట్టిన రెండో విడత అవగాహన కార్యక్రమం (Awareness Campaign) కొత్తగూడెంలో (Kothagudem) జరిగింది. ఈ సందర్భంగా ఫ్యాన్స్ అసోసియేషన్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మతిన్ ఆధ్వర్యంలో గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డీఎంహెచ్‌ఓ డాక్టర్ తుకారం రాథోడ్, డీసీహెచ్‌ఎస్ డాక్టర్ జి. రవిబాబులను కలిసి హెచ్‌పీవీ టీకా అవగాహన పోస్టర్‌ను ఆవిష్కరించారు.

క్యాన్సర్‌ నివారణలో టీకా కీలకం

​ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ తుకారం రాథోడ్ మాట్లాడుతూ.. హెచ్‌పీవీ వైరస్ వల్ల భవిష్యత్తులో ఎదురయ్యే పలు రకాల క్యాన్సర్లను నివారించడంలో ఈటీకా ఎంతో ఉపయోగకరమని, అర్హులైన పిల్లలు, యువత వైద్యుల సూచనల మేరకు దీనిని తీసుకోవాలని సూచించారు. టీకాపై ఉన్న అపోహలను తొలగించుకుని శాస్త్రీయ అవగాహనతో ముందుకు రావాలని కోరారు. అభిమానులు హంగామాకే పరిమితం కాకుండా తమ అభిమానానికి సామాజిక సేవను తోడు చేసి ప్రజారోగ్యానికి ఉపయోగపడే కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అధికారులు ప్రశంసించారు. రాష్ట్ర అధ్యక్షుడు అంజి యాదవ్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో కొత్తగూడెం ఫ్యాన్స్ కమిటీ సభ్యులు హుస్సేన్, ముస్తఫా, రాహుల్, అశోక్, తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>