కలం, ఆదిలాబాద్: ఆదిలాబాద్ పట్టణంలోని భుక్తాపూర్ కాలనీలోని ప్రముఖ పురాతన శాకంబరీ ఆలయాన్ని జిల్లా కలెక్టర్ రాజర్షి షా (Rajarshi Shah) బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన జిల్లా కలెక్టర్కు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ పూజా కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ వేనుగంటి ప్రకాష్, సనాతన హిందూ ఉత్సవ సమితి అధ్యక్షులు ప్రమోద్ కుమార్ ఖత్రి, ప్రముఖులు ప్రవీణ్ చతుర్వేది, మాజీ కౌన్సిలర్ గోనెల చిన్నస్వామి, ఎన్నవార్ కృష్ణ, మాధస్తు సంతోష్, అనిల్, కాలనీవాసులు, తదితరులు పాల్గొన్నారు.

