ఆదిలాబాద్ కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో దసరా సందడి

కలం, ఆదిలాబాద్: విజయదశమి (Vijayadashami) పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ రాజర్షి షా (Rajarshi Shah) మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో దసరా వేడుకలు నిర్వహించారు. ఆయుధ పూజలో(Ayudha Puja) భాగంగా అధికారిక వాహనాలకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ జిల్లా ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దసరా పండుగను జరుపుకుంటామని పేర్కొన్నారు. ప్రజలందరూ కుటుంబ సభ్యులతో ఆనందోత్సాహాలతో, సుఖసంతోషాలతో, సురక్షితంగా పండుగను జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సీసీలు కార్తీక్, యాసిన్, డ్రైవర్లు రషీద్, సఫ్దర్ అలీ, క్యాంపు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>