వెంకటేశ్ ‘ఆదర్శ కుటుంబం’ రిలీజ్ డేట్ ఫిక్స్

కలం, సినిమా : టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేశ్‌, త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన బిగ్గెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్  ‘ఆదర్శ కుటుంబం'(Aadarsha Kutumbam) మూవీ రిలీజ్ డేట్ ఎట్టకేలకు ఫిక్స్ అయింది. షూటింగ్ డిలే కారణంగా వరుసగా వాయిదా పడుతూ వస్తున్నఈ సినిమా విడుదల తేదీని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.  అక్టోబర్ 30న ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయనున్నట్లు వెల్లడించింది.

ఈ సందర్భంగా ప్రేక్షకులకు విజయదశమి శుభాకాంక్షలు తెలుపుతూ.. వెంకటేశ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేశారు. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో రెండు దశాబ్దాల తర్వాత కలిసి పనిచేయడం ప్రత్యేకమైన అనుభూతినిస్తోందని తెలిపారు. తమ కాంబినేషన్‌లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఆదర్శ కుటుంబం సినిమా వినోదంతో పాటు యాక్షన్, మరెన్నో ఆసక్తికర అంశాలతో అలరించనుందని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి సినిమాను థియేటర్లలో వీక్షించాలని అభిమానులను కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>