కలం, ఆదిలాబాద్ : జాతీయ ఆయుష్ మిషన్ పరిధిలో ఆదిలాబాద్ (Adilabad Ayush Recruitment) జిల్లాలో వివిధ విభాగాల్లో 10 ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ఆయుష్ మెడికల్ ఆఫీసర్ (పీజీ అర్హతతో) ఒకటి, ఆయుష్ మెడికల్ ఆఫీసర్ మూడు, డైటీషియన్ ఒకటి, సైకోసోషల్ కౌన్సెలర్ (ఆన్కాల్) ఒకటి, యోగా ప్రొఫెషనల్ ఒకటి, మల్టీ పర్పస్ వర్కర్ (ఎంపీడబ్ల్యూ) మూడు పోస్టులను భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. అర్హతలు, దరఖాస్తు ఫారం, ఇతర వివరాలను జిల్లా అధికారిక వెబ్సైట్ adilabad.telangana.gov.inలో పొందవచ్చని తెలిపారు.
పూర్తి చేసిన దరఖాస్తులను ఈ నెల 26వ తేదీ వరకు అన్ని పని దినాల్లో ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆదిలాబాద్ జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి కార్యాలయంలో సమర్పించాలని సూచించారు. పోస్టు ద్వారా దరఖాస్తులు పంపినప్పుడు జరిగే ఆలస్యాలకు శాఖ బాధ్యత వహించదని తెలిపారు. నోటిఫికేషన్ను ఎప్పుడైనా రద్దు చేసే అధికారం నియామక కమిటీకి ఉంటుందని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు జిల్లా ఆయుష్ నోడల్ అధికారిని 8639785919 మొబైల్ నంబరులో సంప్రదించాలని సూచించారు.

