అమ్మవారి ఆభరణాలను దర్శించుకున్న ఎస్పీ జానకి షర్మిల

కలం, నిర్మల్ : అడెల్లి శ్రీ మహా పోచమ్మ అమ్మవారి జాతర సందర్భంగా సాంగ్వి గ్రామం వద్ద గోదావరి నదిలో ఆభరణాలను శుద్ధి చేసి తిరిగి తీసుకువస్తుండగా జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల ( SP Janaki Sharmila) దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారి ఆభరణాలను తలపై ఎత్తుకొని ముందుకు సాగారు. సారంగాపూర్ మండలం అడెల్లి గ్రామంలో నిర్వహించిన శ్రీ మహా పోచమ్మ అమ్మవారి జాతరకు వేలాదిగా భక్తులు తరలివచ్చిన నేపథ్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహించారని ఎస్పీ తెలిపారు. జాతర ప్రశాంతంగా, విజయవంతంగా ముగిసిందని పేర్కొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>