ఏపీ టెట్–2026 షెడ్యూల్ విడుదల చేసిన మంత్రి నారా లోకేశ్

కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) ఏపీ టెట్ –2026 (AP TET 2026) నోటిఫికేషన్ విడుదలపై కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో పాఠశాల విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేయడం, నాణ్యమైన బోధన ప్రమాణాలను పెంపొందించడమే లక్ష్యంగా ఈ పరీక్షను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

టెట్–2026 నోటిఫికేషన్ జూన్ 5న విడుదల కానుండగా, అదే రోజు నుంచి జూలై 5 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు వెల్లడించారు. జూలై 25 నుంచి హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయని, ఆగస్టు 5 నుంచి 21 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ 15న ఫలితాలు విడుదల చేస్తామని వివరించారు.

వివరాల కోసం https://tet2dsc.apcfss.in వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చని సూచించారు. అదేవిధంగా ప్రభుత్వ జాబ్ క్యాలెండర్‌లో భాగంగా టీచర్ల నియామకాలకు సంబంధించి DSC–2026 నోటిఫికేషన్ అక్టోబర్ 2026లో విడుదల చేయనున్నట్లు మంత్రి లోకేశ్ తెలిపారు. టీచర్ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు, ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>