జేఈఈ అడ్వాన్స్ డ్ ఫలితాలు విడుదల

కలం, వెబ్ డెస్క్ : దేశంలోని ప్రతిష్టాత్మక ఐఐటీలలో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 (JEE Advanced 2026) పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఏడాది పరీక్షను నిర్వహించిన ఐఐటీ కాన్పూర్ సోమవారం అధికారికంగా ఫలితాలను ప్రకటించింది. ఈ ఏడాది మే 17న నిర్వహించిన పేపర్ 1, పేపర్ 2 పరీక్షలకు 1,79,694 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 56,880 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. విజయం సాధించిన వారిలో 10,107 మంది మహిళా అభ్యర్థులు ఉండటం విశేషం.

అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ jeeadv.ac.inలో ఫలితాలను చూసుకోవచ్చు. ఈ పరీక్షలో ఢిల్లీ జోన్‌కు చెందిన శుభమ్ కుమార్ టాపర్‌గా నిలిచారు. విశాఖ నారాయణ కాలేజీకి చెందిన సందీప్ కు 5వ ర్యాంక్ వచ్చింది. అయితే ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ఐఐఐటీల్లో సీట్ల కేటాయింపు కోసం నిర్వహించే జోసా (JoSAA)-2026 కౌన్సెలింగ్ ప్రక్రియ రేపటి నుంచి (జూన్ 2) ప్రారంభం కానుంది.  అర్హత సాధించిన విద్యార్థులు రేపటి నుంచి తమకు నచ్చిన కాలేజీలు, కోర్సుల ఆప్షన్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.

Read Also: మనిషి నిద్ర లేకుండా ఎన్ని రోజులు బతకగలడు..? అసలు నిజాలు ఇవే!

Follow Us On: Instagram

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>