epaper
Thursday, March 5, 2026
epaper

భారత్ సిక్సర్ల సునామీ.. ఇంగ్లాండ్​ ముందు భారీ లక్ష్యం!

కలం, వెబ్​ డెస్క్​: ముంబైలోని వాంఖడే స్టేడియం భారత బ్యాటర్ల సిక్సర్ల హోరుతో దద్దరిల్లిపోయింది. టీ20 ప్రపంచకప్ 2026 (T20 World Cup 2026) సెమీఫైనల్‌లో భాగంగా గురువారం ఇంగ్లాండ్​తో జరిగిన మ్యాచ్​లో టీమ్ ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 253/7 పరుగుల రికార్డు స్కోరు సాధించింది. ఇంగ్లాండ్​ ఫైనల్ చేరాలంటే ఇప్పుడు 254 పరుగులు చేయాల్సి ఉంది. ఈ మ్యాచ్​లో ఇన్నింగ్స్ ప్రారంభం నుంచే భారత్ దూకుడుగా ఆడింది. ఓపెనర్ అభిషేక్ శర్మ (9) త్వరగానే అవుట్ అయినా, సంజూ శాంసన్ తుఫాన్‌లా విరుచుకుపడ్డాడు. కేవలం 42 బంతుల్లో 89 పరుగులు సాధించాడు. 8 ఫోర్లు, 7 సిక్సర్లతో బౌలర్లను చెదరగొట్టాడు. సెంచరీకి దగ్గరగా వెళ్లి ఔట్ కావడంతో అభిమానులు కాస్త నిరాశ చెందారు. అయినా అతని ఇన్నింగ్స్ మ్యాచ్‌కు బలమైన పునాది వేసింది.

ఇషాన్ కిషన్ కూడా వేగం తగ్గనివ్వలేదు. 18 బంతుల్లో 39 పరుగులు చేసి, స్కోర్‌బోర్డ్‌ను పరుగెత్తించాడు. ఫోర్లు, సిక్సర్లతో స్టేడియంలో ఉత్సాహం నింపాడు. మధ్యలో శివం దూబే వచ్చాక మ్యాచ్ మళ్లీ గట్టిగా మలుపు తిరిగింది. 25 బంతుల్లో 43 పరుగులు చేసి భారీ షాట్లతో ఇంగ్లండ్ బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టాడు. నాలుగు భారీ సిక్సర్లతో ప్రేక్షకులను అలరించాడు. కానీ రన్‌ఔట్‌గా వెనుదిరగడం భారత్‌కు చిన్న షాక్‌గా మారింది. కెప్టెన్​ సూర్యకుమార్ యాదవ్ ఎక్కువసేపు నిలవలేకపోయాడు. 6 బంతుల్లో 11 పరుగులు చేసిన అతను ఆదిల్ రషీద్ గూగ్లీకి బోల్తాకొట్టాడు. బట్లర్ చేతిలో స్టంపింగ్ అయ్యాడు.

ఇన్నింగ్స్ చివర్లో హార్దిక్ పాండ్యా కూడా తన స్టైల్ చూపించాడు. తక్కువ బంతుల్లో వేగంగా పరుగులు చేసి స్కోర్‌కు వేగం తెచ్చాడు. మొత్తానికి భారత బ్యాటర్ల దాడి ముందు ఇంగ్లాండ్​ బౌలర్లు నిలవలేకపోయారు. ఇంగ్లీష్​ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ అత్యధికంగా 4 ఓవర్లలో 61 పరుగులిచ్చాడు. విల్ జాక్స్, ఆదిల్ రషీద్ చెరో రెండు వికెట్లు తీసినప్పటికీ, పరుగుల ప్రవాహాన్ని మాత్రం అడ్డుకోలేకపోయారు. దాంతో ఇంగ్లాండ్​ ముందు 254 పరుగుల భారీ లక్ష్యం నిలిచింది. ఇప్పుడు ఈ భారీ టార్గెట్‌ను ఛేజ్ చేయడం ఇంగ్లాండ్​ బ్యాటర్లకు పెద్ద సవాల్‌గా మారింది. సెమీఫైనల్‌లో(T20 World Cup 2026) ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!