epaper
Thursday, March 5, 2026
epaper

సూరీడు అవుట్.. రషీద్ గూగ్లీకి సూర్యకుమార్ క్లీన్ స్వీప్!

కలం, స్పోర్ట్స్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) ఎక్కువసేపు క్రీజ్‌లో నిలవలేకపోయాడు. వేగంగా పరుగులు చేయాలన్న ప్రయత్నంలో స్కై చివరకు స్టంపౌట్ అయ్యాడు. అదిల్ రషీద్ వేసిన ఫుల్ లెంగ్త్ గూగ్లీకి సూర్యకుమార్ స్వీప్ ఆడేందుకు ముందుకు వచ్చాడు. బంతి ఆఫ్‌సైడ్ బయట పడినా స్వీప్‌కు ముందే కిందుగా వెళ్లి లోపలికి తిరిగింది. ఆ క్షణంలో వికెట్ కీపర్ జోస్ బట్లర్ వేగంగా బేల్స్ తొలగించాడు. బ్యాట్ తిరిగి క్రీజ్‌లోకి వచ్చేలోపు స్టంప్స్ కూలడంతో స్కై ఔట్‌గా ప్రకటించారు.

సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) 6 బంతుల్లో 11 పరుగులు చేశాడు. ఒక సిక్స్‌తో తన ఇన్నింగ్స్ కొనసాగించినా ఎక్కువసేపు నిలవలేకపోయాడు. ఈ మ్యాచ్‌లో భారత జట్టు బ్యాటింగ్‌లో సంజూ శాంసన్ 42 బంతుల్లో 89 పరుగులతో మెరిపించాడు. ఇషాన్ కిషన్ 18 బంతుల్లో 39 పరుగులు చేశాడు. శివం దూబే 21 బంతుల్లో 35 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అభిషేక్ శర్మ 9 పరుగులు చేశాడు. 15.4 ఓవర్లకు భారత్ 4 వికెట్లు కోల్పోయి 190 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బౌలింగ్‌లో విల్ జాక్స్, అదిల్ రషీద్ తలా రెండు వికెట్లు తీశారు.

Read Also: శతకం అంచులో ఆగిన సంజూ శాంసన్.. 89 పరుగుల వద్ద ఔట్

Follow Us On : WhatsApp

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!