epaper
Thursday, March 5, 2026
epaper

రేవంత్ ఆదేశించాడు.. కలెక్లర్టు పాటిస్తున్నారు!

కలం, వెబ్ డెస్క్: ప్రజా ప్రభుత్వం ఏర్పడి రెండేండ్లు దాటిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పరిపాలనపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఇప్పటికే ఆయన 99 రోజుల యాక్షన్ ప్లాన్‌కు (99 Day Action Plan) శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పరిపాలనపై మరింత పట్టు బిగించేందుకు ఆయన కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులతోనూ సమావేశమయ్యారు. సంక్షేమ పథకాలు, ఇతర అభివృద్ధి పనులను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని ఆయన సంకల్పించారు. ఈ క్రమంలో కొంతమంది కలెక్టర్లు హెడ్ క్వార్టర్లను దాటి ప్రజల్లోకి వెళ్లకపోవడంపై ఆయన మండిపడ్డారు. పనిచేసేవారికి ప్రాధాన్యం ఉంటుందని పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారాయన. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ ఆదేశాల మేరకు కలెక్టర్లు (Collectors) పరుగులు పెడుతున్నారు. ఆయా జిల్లాల్లో వరుసగా తనిఖీలు చేస్తూ పరుగులు తీస్తున్నారు. సమస్యలను తెలుసుకుంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు.

జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ (Collector Satyaprasad) గురువారం మెట్‌పల్లిలోని బీసీ వెల్ఫేర్ పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు. హాస్టల్‌లోని వసతులు, విద్యా బోధన తీరును పరిశీలించారు. విద్యార్థులతో నేరుగా ముచ్చటించి వారికి అందుతున్న భోజన నాణ్యతను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో పరిశుభ్రత పాటించాలని, విద్యార్థులకు మెరుగైన వసతులతో పాటు పోషక విలువలతో కూడిన నాణ్యమైన ఆహారాన్ని అందించాలని అధికారులను ఆదేశించారు. అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరులో ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ అంకిత్ (Collector Ankit) గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్పిటల్ లోని వివిధ విభాగాలను పరిశీలించిన కలెక్టర్ రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి ఆరా తీశారు.

జగిత్యాల, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలతోపాటు మరికొంతమంది కలెక్టర్లు తమ కార్యాలయాలను దాటి ప్రజల్లోకి వెళ్తున్నారు. ఆస్పత్రులు, స్కూళ్లు, హాస్టళ్లను తనిఖీలు చేస్తున్నారు. కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటిస్తుండటంతో ప్రజల్లో మంచి స్పందన వస్తోంది.

Read Also: తెలంగాణ IPS కు అమిత్ షా బంపర్ ఆఫర్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!