కలం, వెబ్ డెస్క్: బిజీ లైఫ్‌లో యువత తమ పెళ్లిళ్ల విషయంలో ప్రాధాన్యతలను పూర్తిగా మార్చుకుంటున్నారు. ఒకప్పుడు 20 ఏళ్లు దాటగానే పెళ్లి (Marriage) చేసుకోవాలనే ఒత్తిడి ఉండేది. కానీ ఇప్పుడు 30 ఏళ్లు దాటిన తర్వాతే మ్యారేజ్ చేసుకోవడం అనేది సాధారణంగా మారుతోంది. ముఖ్యంగా కెరీర్ సెటిల్మెంట్ను పెళ్లి కంటే ముందే పూర్తి చేయాలని మెజార్టీ యువత భావిస్తోంది. ఈ మార్పుకు ప్రధాన కారణం ఆర్థిక స్వేచ్ఛ. వ్యక్తిగత ఎదుగుదల.
నేటి యువతీ యువకులు (Youth) వైవాహిక బంధంలోకి అడుగుపెట్టే ముందు మంచి పొజిషన్లో ఉండాలని కోరుకుంటున్నారు. 20 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకుని కుటుంబ బాధ్యతల్లో మునిగిపోవడం కంటే, ఆ సమయాన్ని చదువు, ఉద్యోగం, ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి కేటాయించడం బెస్ట్ అని అభిప్రాయపడుతున్నారు. దీనివల్ల మానసిక పరిపక్వత పెరిగి, వైవాహిక జీవితంలో వచ్చే సమస్యలను ఎదుర్కోవడం సులభమవుతుందని నిపుణులు సైతం విశ్లేషిస్తున్నారు.
అయితే..ఈ ధోరణిపై భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఆలస్యంగా వివాహం ((Marriage) చేసుకోవడం వల్ల సంతానోత్పత్తి సమస్యలు వచ్చే అవకాశం ఉందని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తుండగా, మరికొందరు మాత్రం బలవంతపు పెళ్లిళ్ల కంటే ఆలస్యంగానైనా చేసుకునే పెళ్లిళ్లే కలకాలం నిలుస్తాయని చెప్తున్నారు.
Read Also: రీల్‌కు రూ.80వేలు.. బెంగాల్లో ఇన్ఫ్లుయెన్సర్లకు డిమాండ్
Follow Us On: Youtube

