epaper
Thursday, March 5, 2026
epaper

ఇరాన్‌పై దాడుల‌పై వైట్‌హౌస్ కీల‌క అప్‌డేట్‌

క‌లం, వెబ్ డెస్క్‌: అమెరికా చేపట్టిన ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’ (Operation Epic Fury) చర్యలపై వైట్‌హౌస్ కీలక వివరాలు వెల్లడించింది. ఈ ఆపరేషన్ ప్రారంభమైన నాలుగు రోజులకే అమెరికా దళాలు పెద్ద ఎత్తున దాడులు నిర్వహించి ఇరాన్‌ (Iran)కు భారీ నష్టం కలిగించాయని తెలిపింది. వైట్‌హౌస్ అధికారిక ఎక్స్ ఖాతాలో ఓ ఆస‌క్తిక‌ర పోస్ట్ చేసి వివరాలు వెల్లడించింది. ఆపరేషన్ ప్రారంభమైన నాలుగు రోజుల్లోనే అమెరికా సైన్యం ఆకాశ‌, భూమి, సముద్ర మార్గాల ద్వారా సమన్వయంతో దాడులు కొనసాగిస్తున్నట్లు పేర్కొంది. ఈ దాడుల్లో ఇప్పటివరకు 20కి పైగా ఇరాన్ నౌకలు ధ్వంసమయ్యాయని తెలిపింది. అలాగే ఇరాన్ నుంచి ప్రయోగించేడ్రోన్ దాడులు 73 శాతం వరకు తగ్గాయని పేర్కొంది. ఇదే సమయంలో బాలిస్టిక్ క్షిపణుల ప్రయోగాలు కూడా 86 శాతం వరకు తగ్గినట్లు వైట్‌హౌస్ వెల్లడించింది. ఈ గణాంకాలను వెల్లడిస్తూ అమెరికా సైన్యం చేపట్టిన చర్యలు ప్రభావవంతంగా కొనసాగుతున్నాయని వైట్‌హౌస్ తెలిపింది. ప్రస్తుతం మిడిల్ ఈస్ట్‌లో పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్న నేపథ్యంలో ఈ ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!