కలం, వెబ్ డెస్క్: సింగపూర్‌లో(Singapore) ఉపాధి పొందాలనుకునేవాళ్లకు గుడ్ న్యూస్. ఆ దేశం తమ విదేశీ కార్మికశక్తి పాలసీని విస్తరించింది. మరో ఎనిమిది సేవా రంగల్లో విదేశీయులు ఉద్యోగాలు చేసుకునే అవకాశాన్ని ప్రవేశపెట్టింది. ఈ మేరకు సింగపూర్ మావనవనరుల అభివృద్ధి శాక మంత్రి తాన్ సీ లెంగ్ మంగళవారం వెల్లడించారు. సోషల్, ఫుడ్, ఎయిర్ ట్రాన్స్పోర్ట్లోని ఎనిమిది రకాల ఉద్యోగాలను నాన్–ట్రెడిషనల్ సోర్స్(ఎన్టీఎస్) కిందకు మారుస్తున్నట్లు చెప్పారు. వచ్చే సెప్టెంబర్ నుంచి వీటిలో పనిచేసుకోవడానికి విదేశీయులకు అనుమతి ఇస్తున్నట్లు చెప్పారు. ఇండియాతో పాటు బంగ్లాదేశ్, భూటాన్, కంబోడియా, లావోస్, మయన్మార్, ఫిలప్పీన్స్, శ్రీలంక, థాయ్‌లాండ్ దేశాల నుంచి వచ్చే వర్క్ పర్మిట్ హోల్డర్లను ఈ ఉద్యోగాల్లో నియమించుకోవచ్చన్నారు.
ఈ ఎనిమిది విభాగాల్లో ఏయే ఉద్యోగాలు ఉంటాయంటే.. బేబీ సిట్టర్లు/పిల్లల సంరక్షకులు, ఎడ్యుకేరర్లు, టీచర్ సహాయకులు, ఫుడ్ ప్రిపేరర్లు, ఫుడ్ లేదా డ్రింక్ స్టాల్ అసిస్టెంట్లు, కిచెన్ అసిస్టెంట్లు, వెయిటర్లు, క్యాబిన్ క్రూ(ఎయిర్ హోస్టెస్/ఫ్లైట్ అటెండెంట్లు).
ఎమర్జింగ్ టెక్నాలజీల్లో..
అలాగే ఎమర్జింగ్ టెక్నాలజీల రంగంలో విదేశీ ప్రతిభను ఆక్షించేందుకు 2027 నుంచి కొత్త వర్క్ పాస్‌ను ప్రవేశపెట్టనున్నట్లు సింగపూర్(Singapore) మంత్రి చెప్పారు. ఇది టెకీలకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఈ వర్క్పాస్ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, గ్రీన్ టెక్నాలజీ వంటి రంగాల్లో సింగపూర్‌లో ఉద్యోగాలు లభిస్తాయని చెప్పారు.

