కలం, తెలంగాణ బ్యూరో: CM vs Civil Servants | ముఖ్యమంత్రి స్పీడ్‌ను బ్యూరోక్రాట్లు అందుకోలేకపోతున్నారా? ఆయన అనుకున్నట్లుగా గ్రౌండ్ లెవల్‌లో విజన్ ఎగ్జిక్యూట్ కావడంలేదా?.. అధికారులు ఫీల్డ్ లోకి వెళ్లడానికి సుముఖంగా లేరా? ఏసీ గదులకు అలవాటుపడ్డారా? గత ప్రభుత్వంతో అంటకాగిన కొందరు పాత పద్ధతులనే కొనసాగిస్తున్నారా? ఇలాంటి చర్చల నడుమ నాలుగు రోజుల క్రితం సీఎం రేవంత్‌రెడ్డి చేసిన కామెంట్లు సరికొత్త చర్చకు తావిచ్చాయి. అధికారుల పనితీరుపై ఆయన అసంతృప్తికి ఈ కామెంట్లు అద్దం పడుతున్నాయి. రెండున్నరేళ్లయినా అధికారులు గాడిన పడలేదన్నది సీఎం మాటల ద్వారా అర్థమవుతున్నది. ఇకపైన కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదనే నిర్ణయానికి వచ్చారు.
గతేడాది జూలైలో జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్ తర్వాత ఎనిమిది నెలలు గడిచినా అదే ట్రెండ్ కొనసాగుతూ ఉన్నదన్నది సీఎం తాజా వ్యాఖ్యలతో స్పష్టమవుతున్నది. కొందరు అధికారుల తీరుపై ముఖ్యమంత్రితోపాటు మంత్రుల అనుమానం.. అదే గాటిలో తమనూ కట్టేస్తున్నారన్నది మరికొందరు ఆఫీసర్ల ఆవేదన! పాలనలో జోడెద్దుల మాదిరిగా ఉండాల్సిన పాలకులు, బ్యూరోక్రాట్ల నడుమ ఈ గ్యాప్ తొలగేదెప్పుడు?! ఇప్పటికే హనీమూన్ పీరియడ్ ముగించుకున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి.. రాబోయే రెండున్నరేండ్లు కీలకం. రాష్ట్ర ప్రజల మనసు గెలుచుకోవాలన్నా.. తిరిగి అధికారంలోకి రావాలన్నా.. అంతా సెట్ రైట్ కావాల్సిందే!! సీఎం వర్సెస్ సివిల్ సర్వెంట్స్ (CM vs Civil Servants) గా కొనసాగుతున్న ఈ అనుమానాలు, ఆవేదనలు ఎటు దారితీయనున్నాయి?
సీఎం vs సివిల్ సర్వెంట్స్.. పాలకులు, బ్యూరోక్రాట్ల మధ్య గ్యాప్ పై కలం 360 డిగ్రీస్ స్పెషల్ చదివేందుకు కింద ఉన్న పేపర్ ఇమేజ్ పై క్లిక్ చేయండి
Read Also: సీపీ వర్సెస్ కౌశిక్ వ్యవహారంలో ట్విస్ట్.. తెరపైకి సస్పెండ్ ఎస్సై!
Follow Us On: Youtube


