epaper
Tuesday, March 3, 2026
epaper

రామ్ చరణ్‌‌కు ఆ లక్షణం చిరంజీవి నుంచే వచ్చింది : బుచ్చిబాబు

కలం, డెస్క్ : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ (Ram Charan) హీరోగా బుచ్చిబాబు డైరెక్షన్ లో వస్తున్న మూవీ పెద్ది (Peddi). ఏప్రిల్ 30న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా నుంచి నిన్న రయ్ రయ్ రారా అనే సాంగ్ రిలీజ్ చేశారు. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తూ పాడిన ఈ సాంగ్ ఫ్యాన్స్ ను బాగానే ఆకట్టుకుంటోంది. ఇందులో చరణ్‌ మాస్ స్టెప్పులపై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు కురిపించారు. పెద్దిలోని ఈ సాంగ్ బిగ్ స్క్రీన్ మీద అగ్నిలా దహిస్తుందని.. చరణ్‌ మాస్ గ్రేస్ తో పాటు స్పీడ్ స్టెప్పులు బాగా ఆకట్టుకుంటున్నాయని చెప్పారు. బుచ్చిబాబు పిక్చరైజేషన్ బాగుందని ప్రశంసలు కురిపించారు.

చిరంజీవి ట్వీట్ కు రిప్లై ఇచ్చిన బుచ్చిబాబు స్పందిస్తూ.. ‘ఆ రోజు ఇంకా గుర్తుంది సార్. ఆ సాంగ్ షూటింగ్ రోజు రామ్ చరణ్‌ కు తీవ్ర జ్వరం ఉంది. నేను షూటింగ్ ఆపేద్దాం అన్నాను. కానీ చరణ్‌ వినలేదు. అంత జ్వరంతోనే వచ్చి అందరి ముందు నార్మల్ గా స్టెప్పులు వేశారు. ఆ డెడికేషన్, హార్డ్ వర్క్ మీ నుంచే వచ్చాయి సర్’ అంటూ చెప్పుకొచ్చాడు బుచ్చిబాబు. దీంతో బుచ్చిబాబు చేసిన ట్వీట్ క్షణాల్లోనే వైరల్ అయిపోతోంది.

Read Also: సీనియర్ జర్నలిస్ట్ మూర్తి సస్పెండ్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!