కలం, సినిమా : టాలీవుడ్ బ్యూటిఫుల్ కపుల్ విజయ్ దేవరకొండ(Vijay Deverakonda), రష్మిక మందన్న(Rashmika Mandanna) వివాహం రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఫిబ్రవరి 26 న గ్రాండ్‌గా జరిగిన సంగతి తెలిసిందే. ఈ జంట తమ వివాహానికి సంబంధించి బ్యూటిఫుల్ మూమెంట్స్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. తాజాగా తమ పెళ్ళికి రెండు రోజుల ముందు జరిగిన సంగీత్ నైట్ (Sangeeth night) వీడియోను విజయ్ దేవరకొండ రిలీజ్ చేశారు.
ఆ నైట్ నవ్వులతో నిండిపోయింది.. కన్నీళ్లు వచ్చే వరకు నవ్వాము, కాళ్ళు నొప్పి అనిపించే వరకు డ్యాన్స్ చేసాము. ప్రతీ ఒక్కరి స్పీచ్, సర్ప్రైజ్‌లతో మా మనస్సు నిండిపోయింది. ఆ నైట్ అందమైన మనుషుల మధ్య ప్రేమ, ఆనందం, సంతోషంతో నిండిన ఒక అద్భుతమైన నైట్‌గా మిగిలింది అంటూ విజయ్ దేవరకొండ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ సంగీత్ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.

