epaper
Monday, March 2, 2026
epaper

మందుబాబులకు షాక్.. హోలీ రోజు వైన్స్, బార్లు బంద్

కలం, వెబ్‌డెస్క్: మందుబాబులకు హైదరాబాద్ పోలీసులు (Hyderabad Police) షాకింగ్ న్యూస్ చెప్పారు. హోలీ సందర్భంగా మంగళవారం నగరంలోని వైన్స్, బార్లు బంద్ చేయనున్నారు. ఈ మేరకు ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ జీ సుధీర్ బాబు ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కమిషనరేట్ పరిధిలోని అన్ని వైన్ షాపులు, బార్లు, రెస్టారెంట్లకు అనుబంధంగా ఉన్న బార్లు మూసేయాలని ఆదేశాలు జారీ చేశారు. స్టార్ హోటల్లు, రిజిస్టర్డ్ క్లబ్‌లలో నిర్వహిస్తున్న బార్లకు ఈ ఆదేశాలు వర్తించవని స్పష్టం చేశారు.

ప్రజలు ప్రశాంతంగా, సురక్షితంగా హోలీ పండుగను జరుపుకోవాలనే ఉద్దేశంతో తెలంగాణ ఎక్సైజ్ చట్టం–1968 ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఆదేశాలను ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Read Also: సీఎం వర్సెస్ సివిల్ సర్వెంట్స్.. ఆగ్రహం, అనుగ్రహం ఎవరిపై?

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!