epaper
Monday, March 2, 2026
epaper

ఇరాన్‌ తాత్కాలిక సుప్రీం లీడర్ అలీరెజా అరాఫీ మృతి..?

క‌లం, వెబ్ డెస్క్‌: ఇజ్రాయెల్‌, అమెరికా సంయుక్త దాడుల‌తో ఇరాన్‌ (Iran)లో ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ఆదివారం ఇరాన్ సుప్రీం లీడ‌ర్ అలీ ఖ‌మేనీ ఈ దాడుల్లో మృతి చెందిన విష‌యం తెలిసిందే. ఆయ‌న మ‌ర‌ణ‌వార్త ప్ర‌పంచ వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారింది. అమెరికా క్ష‌మించ‌రాని నేరం చేసింద‌ని, దీనికి ప్ర‌తీకారం తీర్చుకుంటామ‌ని ఇరాన్ ప్ర‌క‌టించింది. అనంత‌రం ఖ‌మేనీ స్థానంలో అలీ రెజా అరాఫీని ఇరాన్ తాత్కాలిక సుప్రీం లీడ‌ర్‌గా నియ‌మించారు. తాజాగా అలీ రెర‌జా అరాఫీ (Alireza Arafi) కూడా ఇజ్రాయెల్‌ దాడుల్లో మృతి చెందిన‌ట్లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

ఈ వార్త‌ల‌పై ఇప్ప‌టి వ‌ర‌కు ఇరాన్ అధికారిక మీడియా స్పందించ‌లేదు. ఖమేనీ మృతి అనంతరం తాత్కాలిక సుప్రీం లీడర్‌గా అలీ రెజా అరాఫీని (Alireza Arafi) ఇరాన్ నేతలు ఎన్నుకున్నారు. అలీ రెజా షియాల‌ మత గురువు. ఆయన ప్రస్తుతం ఇరాన్‌లోని మత విద్యా సంస్థలు, మ‌త సంబంధిత కీల‌క మత పదవుల్లో ఉన్నారు.

Read Also: డిజిటల్ హెల్త్ కార్డు.. ఫోటో, క్యూఆర్ కోడ్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!