కలం, వెబ్ డెస్క్ : అంగన్‌వాడీ కేంద్రాల్లో(Anganwadi Centers) చిన్నారులకు అందిస్తున్న బ్రేక్‌ఫాస్ట్ మిక్స్ (Breakfast Mix Quality)ను మంత్రి సీతక్క (Minister Seethakka) స్వయంగా రుచి చూసి పరిశీలించారు. పిల్లలకు అందించే ఆహారం నాణ్యత, రుచి, పోషక విలువలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా బ్రేక్‌ఫాస్ట్ మిక్స్ మరింత మృదువుగా, చిన్నారులకు సులభంగా తినే విధంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
పోషకాహార లోపం నివారణలో అంగన్‌వాడీ కేంద్రాల పాత్ర కీలకమని మంత్రి పేర్కొన్నారు. త్వరలో పైలట్ ప్రాజెక్ట్ కింద బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్ ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ పథకాన్ని వచ్చే ఆర్థిక సంవత్సరంలో పూర్తి స్థాయిలో అమలు చేయడానికి అవసరమైన బడ్జెట్ ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. చిన్నారుల ఆరోగ్యాభివృద్ధి ప్రభుత్వ ప్రాధాన్యంగా కొనసాగుతుందని మంత్రి సీతక్క (Minister Seethakka) స్పష్టం చేశారు.
Read Also : మేక పిల్ల కోసం బాలుడి సాహసం.. వీడియో వైరల్
Follow Us On: X(Twitter)

