epaper
Sunday, March 1, 2026
epaper

స్పానిష్ క్లబ్‌లో రోనాల్డో వాటా

కలం, వెబ్ డెస్క్: ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో (Cristiano Ronaldo) ఆటలోనే కాదు, పెట్టుబడుల్లోనూ తన మార్క్ చూపిస్తున్నారు. తాజాగా ఆయన స్పెయిన్‌కు చెందిన సెకండ్ డివిజన్ క్లబ్ ‘అల్మేరియా’లో 25 శాతం వాటాను కొనుగోలు చేసినట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ పెట్టుబడికి సంబంధించి రొనాల్డోకు చెందిన ‘CR7 స్పోర్ట్స్ ఇన్వెస్ట్‌మెంట్స్’ (CR7 Sports Investment) గురువారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఫుట్‌బాల్ క్లబ్ యాజమాన్య బాధ్యతల్లో భాగం కావాలనేది తన చిరకాల కోరికని, అల్మేరియా క్లబ్‌కు మంచి పునాదులు ఉండటంతో పాటు భవిష్యత్తులో ఎదిగే అవకాశం ఉందని రొనాల్డో పేర్కొన్నారు.

సౌదీకి చెందిన SMC గ్రూప్ యాజమాన్యంలో ఉన్న అల్మేరియా క్లబ్, ప్రస్తుతం స్పానిష్ సెకండ్ డివిజన్‌లో మూడో స్థానంలో ఉంది. 2024లో టాప్ లీగ్ నుంచి తప్పుకున్న ఈ జట్టు, ఇప్పుడు మళ్లీ ప్రమోషన్ పొందేందుకు కేవలం ఒక పాయింట్ దూరంలో ఉంది. రొనాల్డో (Cristiano Ronaldo) రాకతో ఈ జట్టు మరింత బలోపేతం అవుతుందని మేనేజ్మెంట్ భావిస్తోంది. అల్మేరియా ప్రెసిడెంట్ మొహమ్మద్ అల్ ఖెరీజీ స్పందిస్తూ.. రొనాల్డోకు స్పానిష్ లీగ్‌లపై పూర్తి అవగాహన ఉందని కొనియాడారు. ముఖ్యంగా క్లబ్‌లోని యూత్ ప్రోగ్రామ్‌ అభివృద్ధిలో ఆయన కీలక పాత్ర పోషిస్తారని వెల్లడించారు.

ప్రస్తుతం సౌదీ క్లబ్ అల్-నసర్ తరపున ఆడుతున్న రొనాల్డో, గత అక్టోబర్‌లో బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్‌లో చేరిన తొలి ఫుట్‌బాల్ క్రీడాకారుడిగా (Football Player) రికార్డు సృష్టించారు. ఇటీవల జట్టులో చిన్నపాటి విబేధాలు తలెత్తినా, తిరిగి ఫామ్‌లోకి వచ్చి గత మూడు మ్యాచ్‌ల్లో నాలుగు గోల్స్ సాధించారు. వచ్చే ఏడాది జరగబోయే ఆరో ప్రపంచకప్‌లో కూడా రొనాల్డో పాల్గొనబోతున్నారు. 41 ఏళ్ల వయసులో ఇదే తన చివరి వరల్డ్ కప్ కావచ్చని ఆయన ఇప్పటికే సూచనప్రాయంగా తెలిపారు. మైదానంలో ఆటగాడిగా రణిస్తూనే, యజమానిగా కొత్త బాధ్యతలు చేపట్టడం ఫుట్‌బాల్ ప్రపంచంలో ఆసక్తికరంగా మారింది.

Read Also : ఇద్దరు భారత ప్లేయర్లకు స్పెషల్ అవార్డులు

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!