epaper
Monday, March 2, 2026
epaper

మిస్ యూనివర్స్- 2025గా ఫాతిమా బాష్

మెక్సికోకు చెందిన ఫాతిమా బాష్ మిస్ యూనివర్స్(Miss Universe) -2025 కిరీటాన్ని దక్కించుకున్నది. ఈ ఏడాది పోటీలు థాయ్‌లాండ్‌లోని బాంకాక్ వేదికగా నిర్వహించారు. మొత్తం 90 దేశాల నుంచి అందాల భామలు పాల్గొన్నారు. 24 ఏళ్ల ఫాతిమా(Fátima Bosch) తన అందం, తెలివితేటలతో న్యాయమూర్తులను మెప్పించగలిగారు. ఫాతిమా విజయంతో మెక్సికో 4వ‌సారి మిస్ యూనివర్స్ కిరీటంగా దక్కించుకున్నది. 1991, 2010, 2023లో కూడా మెక్సికో భామలు కిరీటం గెలుచుకున్నారు. గత సంవత్సరం మిస్ యూనివర్స్ గా నిలిచి డెన్మార్క్ భామ విక్టోరియా కెజార్ హెల్విగ్ ఫాతిమాకు కిరీటం అందించారు. తొలి రన్నరప్‌గా థాయ్‌లాండ్‌కి చెందిన ప్రవీనర్ సింగ్, రెండో రన్నరప్‌గా వెనెజువెలా ప్రతినిధి స్టిఫానీ అబాసలీ నిలిచారు.

Miss Universe లో భారత్‌కు నిరాశ

భారత్ తరఫున ఈ ఏడాది మణికా విశ్వకర్మ పోటీలో పాల్గొన్నారు. రాజస్థాన్‌కు చెందిన మణికా, స్విమ్‌సూట్ రౌండ్‌లో ఆకట్టుకునే ప్రదర్శన ఇచ్చి టాప్ 30లో స్థానం సంపాదించగలిగారు. అయితే, టాప్ 12లోకి చేరలేకపోయారు. మణికా ప్రదర్శనలో ప్రత్యేకంగా స్పష్టమైన హావభావాలు, నాట్యకళ ఆమెకు గుర్తింపు ఇచ్చాయి. కానీ ఆమె గట్టి పోటీ ఇవ్వలేక వెనుదిరిగారు.

Read Also: అన్నపూర్ణ, రామానాయుడు స్టూడియోలకు నోటీసులు

Follow Us on : Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!