డిసెంబ‌ర్‌లో పెళ్లి.. తేజ స‌జ్జా క్లారిటీ!

క‌లం, సినిమా: హను-మాన్ చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా (Teja Sajja) త్వరలో పెళ్లిపీటలు ఎక్కనున్నారు. ఈ ఏడాది డిసెంబర్‌లో రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో అత్యంత సన్నిహితుల సమక్షంలో ఆయన పెళ్లి జరగనుంది. ఇది పెద్దలు కుదిర్చిన వివాహమని, తనకు కాబోయే భార్యకు సినిమా ఇండ‌స్ట్రీకి ఎలాంటి సంబంధం లేద‌ని తేజ స‌జ్జా క్లారిటీ ఇచ్చాడు. ఆమె టెక్నాలజీ వ్యాపార కుటుంబానికి చెందినవారని కూడా తెలిపారు. అమెరికాలో పెరిగిన ఆమెకు సెలబ్రిటీ హోదా, లైమ్‌లైట్ పట్ల ఎలాంటి ఆసక్తి లేదని, ఆమెలోని ఆ సాధారణ తత్వమే తనకు బాగా నచ్చిందని వెల్లడించారు.

నవంబర్‌లో నిశ్చితార్థం, డిసెంబర్‌లో పెళ్లి జరగనున్నట్లు ఆయన పేర్కొన్నారు. తన వ్యక్తిగత జీవితాన్ని ఎప్పుడూ సీక్రెట్‌గా ఉంచే తేజ సజ్జా, తన వివాహ వేడుకను కూడా చాలా ప్రైవేట్‌గా జరపాలని నిర్ణయించుకున్నారు. దీన్ని ఎలాంటి స్టార్-స్టడెడ్ ఈవెంట్‌గా మార్చకుండా, కేవలం ఫ్యామిటీ, కొద్దిమంది అత్యంత సన్నిహితుల సమక్షంలో మాత్రమే నిర్వహించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఉదయ్‌పూర్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ ముగిసిన తర్వాత, హైదరాబాద్‌లో టాలీవుడ్ ప్రముఖులు, స్నేహితుల కోసం గ్రాండ్‌ రిసెప్షన్ పార్టీని ఏర్పాటు చేయనున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>