కలం, వెబ్ డెస్క్: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు. తెలంగాణ రాష్ట్రంలో వీలైనంత త్వరలో రోహిత్ వేముల చట్టాన్ని (Rohith Vemula Act) తీసుకొస్తామని వెల్లడించారు. శనివారం ప్రజాభవన్లో జస్టిస్ ఫర్ రోహిత్ వేముల క్యాంపెయిన్ కమిటీ సభ్యులతో డిప్యూటీ సీఎం సమావేశమయ్యారు. రాష్ట్రంలో రోహిత్ వేముల చట్టం తీసుకురావాలంటూ దేశ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సైతం సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారని గుర్తు చేశారు. సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి రోహిత్ చట్టాన్ని తీసుకువచ్చేందుకు ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని కమిటీకి తెలియజేశారు. కర్ణాటక రాష్ట్రంలో రోహిత్ వేముల చట్టం కోసం క్యాంపెయిన్ కమిటీ రూపొందించిన ముసాయిదాను కమిటీ సభ్యులు డిప్యూటీ సీఎంకు (Bhatti Vikramarka) అందజేశారు.
ఈ సందర్భంగా కమిటీ సభ్యులు కొన్ని విజ్ఞప్తులు చేశారు. రోహిత్ వేముల కేసును పారదర్శకంగా విచారణ జరిపించాలని, న్యాయం చేయాలని కోరారు. రోహిత్ వేముల మరణం తర్వాత యూనివర్సిటీలో 50 మంది విద్యార్థులు, ఇద్దరు టీచర్ల పైన నాన్ బెయిలబుల్ కేసులు నమోదయ్యాయి వీటినుంచి వారికి విముక్తి కల్పించాలని కోరారు. కర్ణాటక రాష్ట్రం తరహాలోనే తెలంగాణలోనూ రోహిత్ వేముల చట్టాన్ని (Rohith Vemula Act) తీసుకురావాలని కోరారు.
సమావేశంలో పాల్గొన్న కర్ణాటక ప్రతినిధులు
1.హులికుంటే మూర్తి – సీనియర్ అంబేద్కరివాది నాయకుడు, ఉపన్యాసకుడు, కర్ణాటక.
2.డా. ఆశ్నా సింగ్ – అసిస్టెంట్ ప్రొఫెసర్, నేషనల్ లా యూనివర్సిటీ – బెంగళూరు.
3.వి. మృదుల – అడ్వకేట్, కర్ణాటక.
4.రాహుల్ – ఏఎస్ఏ (ASA), జీకేవీకే – బెంగళూరు.
‘జస్టిస్ ఫర్ రోహిత్ వేముల’ ఉద్యమ ప్రతినిధులు
1.రాధికా వేముల
2.రాజా వెముల
3.ప్రొఫెసర్ భాంగ్య భుక్య – యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్.
4.ప్రొఫెసర్ సౌమ్యా దేచమ్మ – యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్.
5.ప్రొఫెసర్ తిరుమల్ – యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్.
6.ప్రొఫెసర్ రత్నం – యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్.
7.వి. రఘునాథ్ – నియమిత సీనియర్ అడ్వకేట్, తెలంగాణ హైకోర్టు.
8.డా. డోంత ప్రశాంత్.
9.తిరుపతి – ఏఎస్ఏ (ASA), హెచ్సీయూ.
10.వెన్నెల – ఏఎస్ఏ (ASA), హెచ్సీయూ తదితరులు పాల్గొన్నారు.
Read Also: మేడారం ట్రస్టు బోర్డు చైర్ పర్సన్ గా సుకన్య ప్రమాణ స్వీకారం
Follow Us On: Sharechat


