epaper
Saturday, January 17, 2026
spot_img
epaper

బాక్సాఫీస్ వద్ద అదరగొడుతున్న నవీన్ పోలిశెట్టి సినిమా

కలం, సినిమా : టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి (Naveen Polishetty) నటించిన లేటెస్ట్ ఫన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ “అనగనగా ఒక రాజు” (Anaganaga Oka Raju). యంగ్ డైరెక్టర్ మారి (Maari) డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యున్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌పై నాగవంశీ, సౌజన్య సంయుక్తంగా నిర్మించారు.

ఈ సినిమాలో నవీన్‌కు జోడీగా క్యూట్ బ్యూటీ మీనాక్షీ చౌదరి (Meenakshi Chaudhary) హీరోయిన్‌గా నటించింది. సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ నెల 14న గ్రాండ్‌గా రిలీజ్ అయిన ఈ మూవీ పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే కలెక్షన్స్ సాదిస్తుంది. ఈ మూవీ విడుదల అయిన 3 రోజుల్లోనే రూ.61.1 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్లు మేకర్స్ ప్రకటించారు. దీనితో ఈ సంక్రాంతి పండుగ నవీన్‌కు బాగా కలిసి వచ్చిందని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Anaganaga Oka Raju
Anaganaga Oka Raju

Read Also: ఎఫ్‌డీ.. స్మాల్ సేవింగ్స్.. ఏది బెస్ట్..?

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>