కలం వెబ్ డెస్క్ : సికింద్రాబాద్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శాంతి ర్యాలీని (Secunderabad Rally) పోలీసులు అడ్డుకున్నారు. ర్యాలీకి అనుమతి లేదని నిరసనకారుల్ని అదుపులోకి తీసుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సికింద్రాబాద్ పేరు మార్చేందుకు కుట్ర చేస్తోందంటూ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav) ఆధ్వర్యంలో నేడు ర్యాలీకి పిలుపునిచ్చారు. సికింద్రాబాద్లోని ప్రతి ఇంటి నుంచి ఒక్కరైనా ర్యాలీలో పాల్గొనాలని తలసాని సూచించారు. ఇందులో విద్యావేత్తలు, స్వచ్ఛంద సంస్థలు పాల్గొనాలని కోరారు. ఉదయం 9 గంటలకు ర్యాలీ కోసం బీఆర్ఎస్ నేతలు భారీగా చేరుకున్నారు. అయితే పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని వాహనాల్లో ఎక్కించి వేరే ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది.
Read Also: ఒడిశాలో ఈడీ సోదాలు.. కోట్లలో డబ్బు సీజ్
Follow Us On : WhatsApp


