కలం, వెబ్ డెస్క్ : సీఎం రేవంత్ రెడ్డికి క్రెడిట్ కొట్టేయడంలో ఉన్న శ్రద్ధ పాలన మీద, ప్రాజెక్టుల మీద పెడితే రైతులకు మేలు జరుగుతుందని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) అన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ పూర్తి చేసిన ప్రాజెక్టులు నిర్మాణాలకు సీఎం రేవంత్ రెడ్డి రిబ్బన్ కట్ చేయడమే పనిగా పెట్టుకున్నాడని విమర్శించారు. కలిసొచ్చే కాలానికి నడిచి వచ్చే కొడుకు అన్నట్లు సీఎం పదవి కలిసి వచ్చిన రేవంత్.. కేసీఆర్ నిర్మించిన ప్రాజెక్టులు, ఉద్యోగ నియామక పత్రాలు రెడీమేడ్ గా తయారై ఉన్నాయన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి పనులు చేయకుండా చెనకా – కొరాట, సదర్మాట్ బ్యారేజీని బ్యారేజీలను తామే పూర్తి చేసినట్లు గొప్పలు చెప్పుకుంటుందని విమర్శించారు. కేసీఆర్ మహారాష్ట్రతో చారిత్రక ఒప్పందం చేసుకొని చెనక – కొరాట బ్యారేజ్, పంప్ హౌస్ లు, మెయిన్ కెనాల్ సబ్‌స్టేషన్ పనులు పూర్తి చేయించారని గుర్తు చేశారు. ప్రాజెక్టు కాలువల పనులకు అవసరమైన 3200 ఎకరాలకు కేసీఆర్ 1600 సార్లు ఎకరాలు సేకరిస్తే.. ఈ రెండేళ్లలో రేవంత్ రెడ్డి ఒక్క ఎకరం గూడెం సేకరించలేదన్నారు.
రెండేళ్లు టైం వేస్ట్ చేసినందుకు రేవంత్ రెడ్డి రైతులకు క్షమాపణ చెప్పాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ కట్టిన ప్రాజెక్టులకు సున్నాలు వేసి.. మేమే కట్టామని చెప్పుకోవడం కాంగ్రెస్ ఆల్ప బుద్ధికి నిదర్శనమని మండిపడ్డారు. అదిలాబాద్ వెనకబాటుతనానికి.. పాలమూరు వలసలకు కాంగ్రెస్ ప్రభుత్వం కారణం కాదా అని ప్రశ్నించారు. మాయ మాటలు చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం అదిలాబాద్ జిల్లాకు తీరని ద్రోహం చేస్తుందని Harish Rao ఆరోపించారు.


