టెస్ట్ క్రికెట్‌కు బంగ్లా స్టార్ క్రికెట‌ర్ వీడ్కోలు!

క‌లం, స్పోర్ట్స్: బంగ్లాదేశ్ క్రికెట్ దిగ్గజం ముష్ఫికర్ రహీమ్ (Mushfiqur Rahim) టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలకనున్నాడు. 2027 ఫిబ్రవరిలో ఇంగ్లండ్‌తో జరిగే రెండు టెస్టుల సిరీస్‌లో తొలి మ్యాచ్‌నే తన చివరి టెస్టుగా ఆడనున్నాడు. ఈ విషయాన్ని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు తమీమ్ ఇక్బాల్ శనివారం ప్రకటించాడు. రిటైర్మెంట్ విషయాన్ని ముష్ఫికర్ కొన్ని రోజుల క్రితమే తమీమ్‌కు ఫోన్‌లో తెలిపాడు. తన తరఫున ఈ ప్రకటన చేయాలని కోరాడు.

ఇప్పటికే వన్డేలు, టీ20లకు వీడ్కోలు పలికిన ముష్ఫికర్.. ఇంగ్లండ్‌తో టెస్టు తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు పూర్తిగా దూరం కానున్నాడు. ముష్ఫికర్ 2005లో ఇంగ్లండ్‌తోనే టెస్టు అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు 108 టెస్టులు ఆడి 7,062 పరుగులు సాధించాడు. ఇందులో మూడు డబుల్ సెంచరీలు ఉన్నాయి. బంగ్లాదేశ్ తరఫున అత్యధిక టెస్టులు ఆడిన ఆటగాడిగా, అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. ముష్ఫికర్ సేవలను తమీమ్ ఇక్బాల్ ప్రశంసించాడు. అతడికి ఘనంగా వీడ్కోలు పలికేందుకు బోర్డు ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేయనుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>