పట్టభద్రుల ఓట్లలో 40వేల మంది అనర్హులు: సోమ భరత్ కుమార్

కలం, తెలంగాణ బ్యూరో: పట్టభద్రుల ఓటర్ల జాబితాలో దాదాపు 35నుంచి 40వేల మంది ఓటర్లు అనర్హులుగా నమోదైనట్టు తేలిందని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్ చెప్పారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ముసాయిదా జాబితాలోని (Graduate MLC Draft Voter List) అవకతవకలపై పార్టీ నాయకులతో కలిసి బీఆర్కే భవన్ లో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డికి శనివారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా భరత్ మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు ప్రక్రియలో భారీగా అవకతవకలు జరుగుతున్నాయని తాము గతంలోనే ఈసీ దృష్టికి తీసుకెళ్లామని, ఇప్పుడు అదే విషయం తేటతెల్లమైందని పేర్కొన్నారు.

తొలగించిన ఓటర్ల వివరాల జాబితాను రాజకీయ పార్టీలకు అందించాలని ఎన్నికల సంఘాన్ని కోరామని, దీనిపై సీఈఓ సానుకూలంగా స్పందించారని వెల్లడించారు. కొన్ని నకిలీ వెబ్‌సైట్లు, ఇతర మార్గాల ద్వారా కాంగ్రెస్ నకిలీ ఓటర్లను నమోదు చేస్తున్నట్టు గతంలోనే తాము ఫిర్యాదు చేశామని గుర్తుచేశారు. స్థానికంగా ఉండే బీఎల్‌వో, బూత్ స్థాయి ఏజెంట్ల సాయంతో ఓటర్ల జాబితాను రూపొందించాలని డిమాండ్ చేశారు.

అప్పుడే స్థానికులెవరో, బయటి వారెవరో స్పష్టంగా గుర్తించొచ్చని అభిప్రాయపడ్డారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రజాస్వామ్యయుతంగా, ఎటువంటి అక్రమాలకు తావు లేకుండా జరగాలన్నదే బీఆర్ఎస్ ఆలోచన అని, ఇదే విషయాన్ని ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశామని తెలిపారు. పోలింగ్ కేంద్రాల దూరం విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరినట్టు వెల్లడించారు. సమావేశంలో కార్పొరేషన్ మాజీ చైర్మన్లు దేవిప్రసాద్, పల్లె రవికుమార్, టీజీపీఎస్సీ మాజీ సభ్యురాలు సుమిత్రానంద, మమత తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>