వట్టెం నవోదయలో ఆరో తరగతి ప్రవేశాల కోసం పరీక్ష

కలం, నాగర్ కర్నూల్: వట్టెం జవహర్ నవోదయ విద్యాలయంలో (Navodaya Vidyalaya) 2027-2028 విద్యాసంవత్సం ఆరవ తరగతిలో ప్రవేశానికి గాను శనివారం నాడు నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాలలోని 18 కేంద్రాలలో నిర్వహించిన ప్రవేశ ఎంపిక పరీక్ష ప్రశాంతంగా శనివారం నాడు నిర్వహించడం జరిగింది. మూడు జిల్లాలలోని 18 పరీక్షా కేంద్రాలలో పరీక్షను నిర్వహించగా 87 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు మొత్తం 4284 మంది దరఖాస్తు చేసుకోగా 3722 మంది హాజరయ్యారు అన్ని కేంద్రాలలో కలిపి 562 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు.

ఇందులో బాలుర హాజరు 2166 మంది హాజరు కాగా, బాలికలు 1556 మంది హాజరయ్యారు. మూడు జిల్లాలలోని వివిధ జిల్లాల విద్యాశాఖాధికారులు, కలెక్టర్లు నియమించిన తనిఖీ అధికారులు, నవోదయ అధికారులు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. వివిధ జిల్లాల పోలీసు శాఖ బందోబస్తు ఏర్పాటు చేయగా, వివిధ జిల్లాల వైద్య ఆరోగ్య శాఖల ఆద్వర్యంలో ప్రథమ చికిత్స కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు , పొరపాట్లకు తావివ్వకుండా పరీక్షను నిర్వహించామని ప్రిన్సిపల్ పూర్ణిమ తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>