వైఎస్ఆర్‌కు టీడీపీ స‌ర్పంచ్ నివాళి.. త‌మ్ముళ్లు షాక్‌!

క‌లం, వెబ్‌డెస్క్‌: రాజకీయంగా టీడీపీ (TDP), వైసీపీ (YSRCP) మ‌ధ్య విబేధాల గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. రెండు పార్టీల మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌నేంత వైరం ఉంటుంది. ఇక స‌భ‌లు, స‌మావేశాలు, రాజ‌కీయ వేదిక‌ల‌పై ఆయా పార్టీల నేత‌లు ప‌ర‌స్ప‌రం తీవ్ర ప‌ద‌జాలంతో దూషించుకుంటారు. ఓ సీనియ‌ర్ నాయ‌కుడి కొడుకైతే ఏకంగా వైసీపీ నేత‌లతో మాట్లాడొద్ద‌ని, సిగ్గు శ‌రం ఉన్న టీడీపీ నాయ‌కులెవ‌రూ వాళ్ల ఇంటికి ఫంక్ష‌న్ల‌కు వెళ్ల‌ర‌ని ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. ఇలా క‌య్యానికి కాలు దువ్వే పార్టీల్లో ఆస‌క్తిక‌ర ప‌రిణామం చోటు చేసుకుంది.

తాజా గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఏక‌గ్రీవంగా ఎన్నికైన ఓ టీడీపీ స‌ర్పంచ్ వైఎస్ఆర్ విగ్ర‌హానికి నివాళులు అర్పించారు. అంతే కాకుండా త‌న చుట్టూ ఉన్న వాళ్లు జై జ‌గ‌న్ నినాదాలు చేస్తుండ‌టం గ‌మ‌నార్హం. ఈ ఘ‌ట‌న గ‌న్న‌వ‌రం జిల్లాలో చోటు చేసుకుంది. బాపులపాడు మండలం రేమల్లెలో స‌ర్పంచిగా ఎన్నికైన యనమదల సుధాకర్ (Yanamadala Sudhakar) ఊరేగింపుగా గ్రామంలో క‌లియ‌తిరిగారు. ఈ సంద‌ర్భంగా త‌న మార్గంలో వైఎస్ఆర్ విగ్ర‌హం క‌నిపించ‌గానే విగ్ర‌హం పాదాల వ‌ద్ద పూల మాల పెట్టి న‌మ‌స్క‌రించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

Also Read : విదేశీ గడ్డపై అన్నమయ్య కీర్తన.. చంద్రబాబు ప్రశంసలు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>