కలం, స్పోర్ట్స్: ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ వైఫల్యాలపై రోహిత్ శర్మ (Rohit Sharma) కీలక వ్యాఖ్యలు చేశాడు. బాధ్యత తీసుకున్న వాళ్లు సరిగా నిర్వర్తించలేదన్నారు. జట్టు వరుస వైఫల్యాలకు కేవలం ప్లేఆఫ్స్‌కు చేరకపోవడమే కారణం కాదని.. మైదానంలో సరైన ఆటతీరు కనబరచలేకపోవడమే అసలైన నిరాశని స్పష్టం చేశాడు. ఐపీఎల్ 2027కు మళ్లీ ముంబై కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలో అతడి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ముంబై ఇండియన్స్ గత మూడు సీజన్లలో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. ఆ సీజన్లలో జట్టు సమష్టిగా పోటీనివ్వలేకపోయిందని పేర్కొన్నాడు. గత సీజన్లో టీమ్ ఆటపై తనతో సహా పలువురు తీవ్ర నిరాశకు గురయ్యామని చెప్పాడు. ఒక ఆటగాడిగా జట్టు సరిగా ఆడకపోతే అసంతృప్తి కలగడం సహజమని అన్నాడు. ముంబై మళ్లీ తన పాత స్థాయికి చేరుకోవడానికి ఏం చేయాలనే అంశంపై ఆలోచించినట్లు వెల్లడించాడు.

