కలం, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులపై మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి, ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తున్నాయని పేర్కొన్నారు. రామాయపట్నంలో ఏర్పాటు చేయనున్న అత్యాధునిక రిఫైనరీకి బీపీసీఎల్ ఆమోదం లభించడంపై లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టు కోసం రూ.1.27 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు వివరించారు.
సంవత్సరానికి 9 మిలియన్ టన్నుల సామర్థ్యం గల ఈ రిఫైనరీ, భారతదేశ శుద్ధి సామర్థ్యాన్ని, ఇంధన భద్రతను పెంపొందించడంలో ఎంతగానో దోహదపడుతుందని లోకేశ్ పేర్కొన్నారు. ఈ రిఫైనరీ ఏర్పాటు ఏర్పాటుతో దేశంలో చమురు శుద్ధి సామర్థ్యాన్ని పెంచడంతోపాటు ఇంధన భద్రతను బలోపేతం చేయడానికి దోహదపడుతుందని ఆయన (Nara Lokesh) వెల్లడించారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధికి ఈ రిఫైనరీ కీలకంగా మారుతుందని లోకేశ్ ఆశాభావం వ్యక్తం చేశారు.

