జడ్జిలుగా ఆ వర్గాలకే అవకాశం.. రాష్ట్రపతికి మాజీ సీజేఐ లేఖ

కలం, వెబ్ డెస్క్: జడ్జిల నియామకంపై పలు ప్రశ్నలు లేవనెత్తుతూ మాజీ సీజేఐ జస్టిస్ బీఆర్.గవాయ్ (BR Gavai) రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాశారు. ఇటీవల కోలిజియం (Collegium) తీసుకుంటున్న నిర్ణయాలు ఒక వర్గానికే మేలు చేకూర్చేలా ఉన్నాయని.. వెంటనే జోక్యం చేసుకోవాలని కోరారు. దేశ జనాభాలో కనీసం 5 శాతం లేని వారికి సుప్రీం కోర్టులో 40 శాతం పదవులు దక్కుతున్నాయి. రకరకాల కారణాలతో గతంలో శిక్ష కింద బదిలీ అయినవారు ఇప్పుడు కీలక కోర్టులకు హై కోర్టు చీఫ్ జస్టిస్‌లుగా పదోన్నతులు పొందుతున్నారు. న్యాయ వ్యవస్థలో ఎంతో నైపుణ్యం, సమర్థుడైన ఒక చీఫ్ జస్టిస్‌ను మరో జడ్జి కోసం చిన్న హై కోర్టుకు బదిలీ చేశారు.

రాష్ట్రపతి జోక్యం చేసుకుంటేనే..

ఇటీవల జరిగిన నిర్ణయాల్లో అణగారిన వర్గాలు, మైనార్టీలు, మహిళలు, ఇతర కులాలకు చెందిన వారిని పూర్తిగా పక్కనపెట్టేశారని బీఆర్.గవాయ్  (BR Gavai) అన్నారు. ఈ నిర్ణయాలు కోలిజియం స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయని.. రాష్ట్రపతి తన రాజ్యాంగ పరిధి మేరకు జోక్యం చేసుకోవాలని విన్నవించారు. ఈ పరిణామాలపై నా అసమ్మతి, తీవ్ర నిరాశను వ్యక్తం చేస్తూ మీకు లేఖ రాస్తున్నానని బీఆర్.గవాయ్ స్పష్టం చేశారు. లేఖ కాపీలను ప్రధాని మోదీ, కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్‌కు కూడా పంపించారు. ఇప్పుడీ లేఖ దేశ న్యాయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Also Read : మోదీ సంకల్పానికి మద్దతు : కింగ్ నాగార్జున

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>